ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్


 
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 17న స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 8న నోటిఫికేషన్‌ జారీ చేసి, మార్చి 3నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు విడతల్లో మండల పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. ఫిబ్రవరి 10న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ను కోర్టు ఆమోదించింది.