అల వైకుంఠపురంలో...


స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈపాటికే విడుదలైన ట్రైలర్‌ మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఇందులోని పాటలు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌ వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఇందులో బన్నీ, పూజా హెగ్డే కలిసి చేసిన స్టెప్పులు ఎంతో ముద్దొస్తున్నాయి. బుట్టబొమ్మలా ఉన్న పూజాను నిజంగానే బుట్టలో పడేశాడని తెలుస్తోంది. ఇక ఫాస్ట్‌ బీటే కాకుండా ఏ బీటైనా తన డ్యాన్స్‌తో ఇరగదీస్తానని బన్నీ మరోసారి నిరూపించాడు.