పందెం పుంజులు ఎన్నాళ్లిలా....


  • 45 పందెం పుంజులు స్వాధీనం
  • విక్రయిస్తున్న ఆరుగురి సభ్యుల నెల్లూరు ముఠా అరెస్టు
  • జంతు హింస చట్టం కింద కేసు నమోదు

చుట్టూ పోలీసులవలయంమధ్యలో మేం...కాళ్లకు కట్లు...పైగా అదిరింపులుఅసలు ఏమి జరుగుతుందోమాకే తెలియదుమానవ వినోదానికిమేం బలి పశువులంఏవో దొరికిన గింజలు, పురుగులుతిన్న మా నోటికి పిస్తాలు, బాదం పప్పులుబలవర్ధక పౌష్టికాహార ముద్దలుఏమిటో ఈ రాచమర్యాదలనుకున్న వేళఅంతలోనే కష్టాలు...చేయని నేరానికిపోలీసుల అదుపులో ఇదిగో ఇలా...మా జాతి మధ్య లేని పౌరుషాన్నిరగిలించి.. మాలో మాకే కోపాన్ని రగిల్చిఆ ఆగ్రహాగ్నిలో మేం రక్తమోడుతుంటేనేలకొరిగి గిలగిలా కొట్టుకుంటుంటేఓడినా, గెలిచినా కొన ప్రాణంతో ఉన్నావిజయగర్వంతో వికటాట్టహాసం చేస్తూమా రక్తమాంసాలనే ఫలహారంగా ఆరగిస్తూఏమిటీ పైశాచిక ఆనందం