స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’.


స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈపాటికే విడుదలైన ట్రైలర్‌ మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఇందులోని పాటలు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌ వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఇందులో బన్నీ, పూజా హెగ్డే కలిసి చేసిన స్టెప్పులు ఎంతో ముద్దొస్తున్నాయి. బుట్టబొమ్మలా ఉన్న పూజాను నిజంగానే బుట్టలో పడేశాడని తెలుస్తోంది. ఇక ఫాస్ట్‌ బీటే కాకుండా ఏ బీటైనా తన డ్యాన్స్‌తో ఇరగదీస్తానని బన్నీ మరోసారి నిరూపించాడు.