ఆశలు.. ఆకాంక్షలకు తొలి అడుగు


తిరుపతి (విద్య), న్యూస్‌టుడే : జాతీయస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించిన ఐఐటీ-జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) మెయిన్స్‌ రాత పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 8వ తేదీ తిరుపతి రీజియన్‌లోని 27 పరీక్షకేంద్రాలలో రాతపరీక్షలు, 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన బీఈ, బీటెక్‌ (పేపర్‌-1) పరీక్షకు 16,070 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను కేవలం 22 రోజుల్లో విడుదల చేయడం విశేషం. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభచాటి జిల్లాఖ్యాతిని జాతీయస్థాయిలో నిలిపారు. అదేవిధంగా బీఆర్క్‌, బీప్లానింగ్‌ (పేపర్‌-2) పరీక్ష ఫలితాలు మే 31న విడుదల కానున్నాయి.