పదుగురు మెచ్చేలావేపాడ మండలంలో ముకుందపురం గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు గోకేడ సత్యారావు, పార్వతిల కుమారుడు మణిబాబు. బక్కునాయుడుపేట ఎ.పి.ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఇతను పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో 10 పాయింట్లు దక్కించుకున్నాడు. ప్రతి రోజూ సుమారు 20 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తూ చదువుకోవడం గమనార్హం.

పేదింట ఆశల దీపం: 
వేపాడ మండలం నీలకంఠరాజపురం గ్రామానికి చెందిన బొజ్జ మానస తల్లిదండ్రులు లక్ష్మీ, అప్పారావు నిరుపేదలు. చిల్లర దుకాణం నిర్వహించుకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తమ కుమార్తె మానసను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివించారు. పదో తరగతి ఫలితాల్లో 10 పాయింట్ల సొంతం చేసుకొని వారి బతుకుల్లో ఆశలు నింపింది. తమ కుమార్తెను ఖచ్చితంగా ఉన్నత చదువులు చదివిస్తామని తల్లిదండ్రులు ఘంటాపథంగా చెబుతున్నారు.

గొర్రెలకాపరి కొడుకు టాపర్‌: వేపాడ మండలం చినగుడిపాల గ్రామానికి చెందిన లండా రమణ, అక్కమ్మ కుటుంబం గొర్రెలుకాపరులుగా కాలం వెల్లదీస్తున్నారు. వీరి కుమారుడు గణేష్‌ నీలకంఠరాజపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. వార్షిక ఫలితాల్లో 10 పాయింట్లు దక్కించుకొని టాపర్‌గా నిలిచాడు.