జగన్ రాజకీయాలకు ఫిట్‌ కాదని..అఫిడవిట్టే చెబుతోంది: దినకర్‌


అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు ఫిట్‌ కాదని.. అఫిడవిట్టే చెబుతోందని టీడీపీ నేత లంకా దినకర్‌ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. జగన్‌‌ ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని, ఏపీ అధికారులను కూడా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. కేసీఆర్‌ తలలో నాలుకగా జగన్‌ వ్యవహరిస్తున్నారని, ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలతో కేసీఆర్‌కు కప్పం కట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు జగన్‌ సామంతరాజులా మారారని లంకా దినకర్‌ ఎద్దేవా చేశారు.