అందాల కాజల్ అగర్వాల్


అందాల కాజల్ అగర్వాల్ త్వరలో యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలసి నటించనుంది. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా కాజల్ ను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు నిర్మిస్తారు.
*  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ రెండో దశ వేడుకలు త్వరలో అమెరికాలో జరగనున్నాయి. ఈ వేడుకలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతాడు. నెల్లాళ్ల క్రితం జరిగిన తొలిదశ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి హాజరైన సంగతి విదితమే.
*  యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడుగా నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో కాజల్ ప్రధాన కథానాయికగా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మరో నాయికగా మెహ్రీన్ ఎంపికైంది.