
మహేశ్ మైనపు విగ్రహం చూశారా..!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహం హైదరాబాద్‌కు వచ్చేసింది. గచ్చిబౌలిలోని మహేశ్‌కు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్లో ఈ విగ్రహాన్ని ఈరోజు ప్రదర్శనకు ఉంచారు. బ్లాక్ సూట్లో మహేశ్ మైనపు బొమ్మ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మహేశ్ తన సతీమణి నమత్ర, పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈరోజు ఉదయం ఏఎంబీ థియేటర్‌కు చేరుకున్నారు. కొన్ని నెలల క్రితం మహేశ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రూపొందించారు. మహేశ్ అభిమానుల కోసం ఒక రోజు పాటు విగ్రహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రేపు ఉదయమే మళ్లీ దీనిని సింగపూర్‌కు తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్ వద్ద బారులు తీరారు.
