రైతుల నామినేషన్‌.. కలెక్టరేట్‌ వద్ద బారులు


నిజామాబాద్ : పంటలకు మద్దతు ధర డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు వినూత్న నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. తమ ఆవేదనను  పట్టించుకోకపోవడంతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి స్వయంగా రైతులే నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే ఆ స్థానంలో దాఖలైన 56 నామినేషన్లలో 50 మంది రైతులే ఉన్నారు. నామినేషన్ల స్వీకరణకు గడువు నేటితో ముగుస్తుండడంతో మరికొంత మంది రైతులు నామపత్రం దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పసుపు, ఎర్రజొన్న రైతులతో పాటు చెరకు రైతులు నామినేషన్ వేయనున్నారు. రెంజల్ మండల చెరకు రైతులు నామినేషన్ వేయడానికి వచ్చి వరుసలో నిలబడ్డారు.