ఏపీ ఎన్నికల సంఘం సంచలన ప్రకటనఅమరావతి: ఏపీ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. ఏపీలో అందిన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని స్పష్టం చేసింది. నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలు టాప్ లో ఉన్నాయని తెలిపింది. ఓట్లను తొలగించాల్సిందిగా 9.5 లక్షల దరఖాస్తులు అందగా...1.41 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని ఈసీ పేర్కొంది. జిల్లాలవారీగా నకిలీ ఓట్లను ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. శ్రీకాకుళం- 2,579, విజయనగరం- 5,166, విశాఖ- 2,407, పశ్చిమగోదావరి 8,669, ప్రకాశం- 6,040, నెల్లూరు- 3,850, కడప- 5,292, కర్నూలు- 7,684, అనంతపురం- 6,516, గుంటూరు- 35,063, తూ.గో- 24,190, కృష్ణా- 19,774, చిత్తూరు- 14,052 నకిలీ ఓట్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.