‘భరత్‌ అనే నేను’ విజయోత్సవం


కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ‘భరత్‌ అనే నేను’ . ఈ నెల 20న రిలీజయిన ఈ సినిమా ఘనవిజయం సాధించి కలెక్షన్ల రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బ్లాక్‌ బ్లస్టర్‌ సెలబ్రేషన్స్‌ పేరుతో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు చిత్రయూనిట్‌.