ఎల్‌ఈడీ లైట్లతో కేన్సర్‌ ముప్పు!


ఎల్‌ఈడీ, నీలం రంగు లైట్ల వల్ల కేన్సర్‌ వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. మహానగరాలలో నివసించే వారిలో నీలం రంగు లైట్ల నుంచి వెలువడే ఉద్గారాల కారణంగా ప్రొస్టెట్‌ కేన్సర్‌ ముప్పు రెండింతలు అధికంగా ఉందని, బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఒకటిన్నర రెట్లు అధికంగా ఉందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌, బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎగ్జెటర్‌లకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.