జంక్‌ ఫుడ్డూ మంచిదే?


కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, బీఫ్‌, పంది మాంసం లాంటి ‘వెస్టర్న్‌ డైట్‌’ ఆరోగ్యానికి హానికరం. వీటితో రక్తపోటు, హృద్రోగాలు, మధుమేహం, ఊబకాయం, పేగు కేన్సర్‌ తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ఆ ఆహారం కూడా శరీరానికి మంచిదేనని తాజా అధ్యయనంలో తేలింది. కొవ్వు ఎక్కువగా ఉండి, చక్కెర తక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే చిన్న పేగులో కొవ్వును కరిగించే బ్యాక్టీరియా పెరిగి జీర్ణక్రియ సక్రమంగా ఉంటుందని అమెరికాలోని మిడ్‌వెస్టర్న్‌ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.