సింగేర్స్ ఛాయిస్1


వరుసగా రెండు సినిమాల్ని వదులుకుని చిత్రసీమకు షాక్‌ ఇచ్చాడు తేజ. ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేసే అవకాశం తేజకే దక్కింది. ఈ చిత్రంలాంఛనంగా మొదలైంది కూడా. సెట్‌కి వెళ్లే ముందు తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వెంకటేష్‌తో తేజ ఓసినిమా చేయాల్సింది. ఇది కూడా పూజా కార్యక్రమాల్ని జరుపుకొంది. కానీ తేజ దీన్నీ వదులుకున్నారు. ఇప్పుడు నాగార్జున వైపు ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. నాగార్జున కోసం తేజ ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. నాగార్జున కూడా తేజతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారట. నాగ్‌ నటించిన ‘ఆఫీసర్‌’ మేలో విడుదల కానుంది. నానితో కలసి ఓ మల్టీస్టారర్‌ చేస్తున్నారు నాగ్‌. ‘ఆఫీసర్‌’ పనులన్నీ అయిపోయాక... తేజ సినిమా పట్టా లెక్కవచ్చు.