ప్రధానీ మోడీ పర్యటన సందర్భంగా కళకళలాడుతున్న శ్రీశైలం

శ్రీశైలం : ప్రధాని నరేంద్రమోడి పర్యటను పురస్కరించుకొని ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. ఆలయ వీధులన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. స్వామి వారి ఆలయ ప్రాంగణం, ప్రధాన రహదారులు రంగ రంగ వైభవంగా ముస్తాబయ్యాయి.